NTV Telugu Site icon

CM Revanth Reddy: 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు..! రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Telangana High Court

Telangana High Court

CM Revanth Reddy: తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. సంక్షేమంతోపాటు ఇతర విషయాలపై కూడా సీఎం రేవంత్ దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కొత్త హైకోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ ప్రేమావతిపేట సమీపంలో భూమిని కేటాయించారు. దీనికి సంబంధించి రేవంత్ ప్రభుత్వం జీవో 55ని కూడా జారీ చేసింది.ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని MHRDలో కలిశారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో కొత్తది నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో హైకోర్టు నూతన భవనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read also: Govinda Namalu: గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి

కొత్త భవన నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరగనున్నాయి. కొహైకోర్టును అక్కడికి తరలించిన తర్వాత పాత భవనాన్ని వారసత్వ భవనంగా పరిరక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనాన్ని సిటీ కోర్టు లేదా మరేదైనా కోర్టు భవనానికి వినియోగించాలని సీఎస్ శాంతకుమారిని సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల స్థలం బుద్వేల్ గ్రామంలో ఉంది. ఇక్కడ 1966లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి 2,500 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడు అదే స్థలంలో వంద ఎకరాలను హైకోర్టు భవనానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. కాగా, కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించడంపై హైకోర్టు న్యాయవాదుల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Venkateshwara Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ ఇంట్లో కనక వర్షమే..!

Show comments