మొదట్లో హడావిడి చేశారు. తర్వాత సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. 15 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణలో జరుగుతోంది ఇదే. ఇప్పుడు 12 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే పేరెంట్స్ వారికి వ్యాక్సిన్ ఇప్పించడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో 15 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. తెలంగాణలో 15 ఏళ్ళు నుంచి 18 ఏళ్ల వయసు వారు 22 లక్షలకు పైగానే ఉన్నారు. అర్బన్ ఏరియాల్లో బాగానే ఉన్నా… రూరల్‌కు వచ్చేసరికి వ్యాక్సినేషన్‌కు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 100 మంది పిల్లలు ఉంటే అధికారులే అక్కడికి వచ్చి వ్యాక్సిన్ ఇవ్వాలనివైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో చాలాచోట్ల అమలుకావడం లేదు. కోవిడ్ కేసులు తగ్గడంతో పిల్లల వ్యాక్సినేషన్ పూర్తిగా పక్కనపెట్టేశారు.
ఇప్పటి వరకు పిల్లలకు కోవాక్సిన్ మాత్రమే ఇస్తున్నారు, తాజాగా బయోలాజికల్ సంస్థకి చెందిన కార్బోవ్యాక్స్ అత్యవసర అనుమతికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తుది అనుమతులు ఇచ్చింది. దీన్ని 12 ఏళ్ల పిల్లలకు ఇవ్వనున్నారు. ఇది త్వరలోనే మార్కెట్లోకి రానుంది. 2010 తర్వాత పుట్టినవాళ్ళు ఈ టీకా తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇటు చూస్తే 15 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇంకా పూర్తి కాలేదు. 50 శాతం కూడా ఫస్ట్ డోస్ ఇంకా జరగలేదని లెక్కలు చెబుతున్నాయి. దీనిపై జనంలో అపోహలు తొలగించాల్సిన అవసరం ఉందంటున్నారు. కేసులు తగ్గాయి కదా అని లైట్ తీసుకుంటే మరో ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. తప్పనిసరిగా పిల్లకు టీకాలు వేయించాలని సూచిస్తున్నారు.