NTV Telugu Site icon

పీవీఎన్ఆర్ మార్గ్ గా మారిన నెక్లెస్ రోడ్…

తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ పేరు చెప్పగానే ముందు గుర్తుకు వచ్చే వాటిలో నెక్లెస్ రోడ్ కూడా ఒక్కటి. అయితే ఈ నెక్లెస్ రోడ్ విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళిగా నెక్లెస్ రోడ్ పేరును పీవీఎన్ఆర్ మార్గ్ గా మార్చింది. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు జరిగిన తెలంగాణ కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 1921 జూన్ 28 న పుట్టిన పీవీ నరసింహారావు 1991 నుండి 1996 వరకు దేశ ప్రధానిగా పని చేసారు. ఆ సమయంలోనే భారతదేశం ఆర్థిక రంగంలో పురోగతి సాధించింది. ఇక 24 డిసెంబర్ 2004 న పీవీ నరసింహారావు కన్నుమూశారు.