ఛత్తీస్‌గఢ్ , తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ (IED) బాంబులు ఒక్కసారిగా పేలడంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు చెందిన 10 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది.
కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, వారు పెద్ద ఎత్తున సమావేశం అయ్యే అవకాశం ఉందని భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సిఆర్పిఎఫ్ (CRPF) , డిఆర్జి (DRG) బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలు అడవిని జల్లెడ పడుతున్న సమయంలో, నేల అడుగున మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేలాయి. ఈ ఆకస్మిక దాడితో జవాన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
Char Dham : చార్‌ధామ్ యాత్రలో సంచలనం.. అన్యమతస్థులకు నో ఎంట్రీ.?
ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో కోబ్రా బెటాలియన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ రుద్రేష్ సింగ్ సహా మరికొందరు డిఆర్జి జవాన్లు ఉన్నారు. కొందరికి కాళ్లు , కంటికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. సంఘటనా స్థలం నుండి క్షతగాత్రులను వెంటనే ఆర్మీ హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించి, అక్కడి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జవాన్లకు ప్రాణాపాయం తప్పిందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన వెంటనే అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా, మరో నాలుగు ఐఈడీ బాంబులను బలగాలు గుర్తించి సురక్షితంగా నిర్వీర్యం చేశాయి. మావోయిస్టుల ఏరివేత కోసం ఈ ప్రాంతంలో ఇప్పటికే భారీ సిఆర్పిఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టుల కుట్రలను భగ్నం చేసేందుకు సరిహద్దుల్లో నిఘాను మరింత ముమ్మరం చేశారు.
Vishwak Sen: మా అమ్మ చెప్పిన మాటను చాలా సీరియస్‌గా తీసుకున్నా: హీరో విశ్వక్‌సేన్
