NTV Telugu Site icon

Shabbir Ali: కేసిఆర్ పాలనలో మళ్లీ నక్సలిజం.. షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు

Shabbir Ali

Shabbir Ali

Shabbir Ali: సీఎం కేసిఆర్ పాలన లో మళ్లీ నక్సలిజం వస్తుందని, తుపాకీ పట్టే రోజులు వస్తాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యాలు చేశారు. కామారెడ్డి జిల్లాలో TSPSC పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో TSPSC పేపర్ల లికేజీ ప్రభుత్వ వైఫల్యం నిరుద్యోగ గోస – అఖిలపక్ష పార్టీల భరోసా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ,TJS పార్టీ అధ్యక్షుడు ప్రోపెసర్ కోదండరాం,అన్ని పార్టీల, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈనేపథ్యంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ పాలన లో మళ్లీ నక్సలిజం వస్తుందని, మళ్లీ తుపాకీ పట్టే రోజులు వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Sangareddy Crime: కుటుంబాన్నే చంపేదుకు స్కెచ్.. బంధువే అంటున్న బాధితులు

30లక్షల మంది పేపర్ లీకేజి లో రోడ్డున పడ్డారని మండిపడ్డారు. తొమ్మిది సంవత్సరాల్లో ఉద్యోగాలు లేవని, కేసిఆర్ చెందినా 40 మందికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో పని చేయటం లేదూ కాని.. కేసిఆర్ రాసిన రాజ్యాంగ పనీ చేస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. పేపర్ లీకేజిలో కేటీఆర్ చెప్పిందీ ఇద్దరే ఇద్దరు అధికారులు ఉన్నారని, సిట్ తో విచారణ చేపిస్తామంటే మాకు నమ్మకం లేదన్నారు. సిటింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సమాజాన్ని లీకర్ మాయం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణ చేసినా అని గొప్పలు చెప్పడం కాదని అన్నారు. సీఎం కేసీఆర్‌ కు దమ్ముంటే దళితుడ్ని సీఎం చేయాలని సవాల్‌ విసిరారు.

Show comments