Shabbir Ali: కేసిఆర్ పాలనలో మళ్లీ నక్సలిజం.. షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabbir Ali: సీఎం కేసిఆర్ పాలన లో మళ్లీ నక్సలిజం వస్తుందని, తుపాకీ పట్టే రోజులు వస్తాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యాలు చేశారు. కామారెడ్డి జిల్లాలో TSPSC పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో TSPSC పేపర్ల లికేజీ ప్రభుత్వ వైఫల్యం నిరుద్యోగ గోస – అఖిలపక్ష పార్టీల భరోసా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ,TJS పార్టీ అధ్యక్షుడు ప్రోపెసర్ కోదండరాం,అన్ని పార్టీల, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈనేపథ్యంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ పాలన లో మళ్లీ నక్సలిజం వస్తుందని, మళ్లీ తుపాకీ పట్టే రోజులు వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Sangareddy Crime: కుటుంబాన్నే చంపేదుకు స్కెచ్.. బంధువే అంటున్న బాధితులు
Also Read
30లక్షల మంది పేపర్ లీకేజి లో రోడ్డున పడ్డారని మండిపడ్డారు. తొమ్మిది సంవత్సరాల్లో ఉద్యోగాలు లేవని, కేసిఆర్ చెందినా 40 మందికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో పని చేయటం లేదూ కాని.. కేసిఆర్ రాసిన రాజ్యాంగ పనీ చేస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. పేపర్ లీకేజిలో కేటీఆర్ చెప్పిందీ ఇద్దరే ఇద్దరు అధికారులు ఉన్నారని, సిట్ తో విచారణ చేపిస్తామంటే మాకు నమ్మకం లేదన్నారు. సిటింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజాన్ని లీకర్ మాయం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసినా అని గొప్పలు చెప్పడం కాదని అన్నారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే దళితుడ్ని సీఎం చేయాలని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!