Site icon NTV Telugu

Hyderabad : ఎన్టీవీ చైర్మన్‌ను సన్మానించిన ఉపరాష్ట్రపతి

హైదరాబాద్​లోని ఎంసీఆర్​హెచ్​ఆర్​డీలో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా మరుమాముల దత్తాత్రేయ శర్మ రచించిన ‘ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయాలు’ గ్రంథావిష్కరణ సభలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి రచన టెలివిజన్‌ సంస్థల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి కూడా విశిష్ట అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరిని శాలువ కప్పి సన్మానించారు.

Exit mobile version