NTV Telugu Site icon

Drug Trafficking: అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

International Drug Traffick

International Drug Traffick

Narcotic Enforcement Wing Bust International Drug Trafficking Network In Bengaluru: అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఛేధించింది. ముగ్గురు నైజీరియన్ డ్రగ్ సప్లయర్స్‌తో పాటు ఓ స్థానిక పెడ్లర్‌ను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి మొత్తం కోటి రూపాయల విలువైన కొకైన్, MDMA స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వివరిస్తూ.. ఈ ముఠా బెంగుళూరు కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపారు. పోలీసులు నెల రోజులపాటు బెంగుళూరులో ఉండి, ఈ ముఠాని పట్టుకున్నారని వెల్లడించారు. ముగ్గురు నైజీరియన్లు అగ్‌బో మ్యాక్స్‌వెల్, ఇకెం ఆస్టిన్ ఒబాక, ఒకేకే చిగోజిలతో పాటు హైదరాబాద్‌కి చెందిన సాయి ఆకేష్‌ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

Tripura Assembly: త్రిపుర అసెంబ్లీలో గందరగోళం.. ఐదుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్

ఈ మొత్తం డ్రగ్స్ వ్యహారంలో మ్యాక్స్‌వెల్ సూత్రధారి అని, నైజీరియాకి చెందిన మరో పెడ్లర్ పరారీలో ఉన్నాడని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మ్యాక్స్‌వెల్, చిగోజీ ఇద్దరూ మెడికల్ వీసాపై ఇండియాకు వచ్చారని.. ఆస్టిన్ ఒబాక స్టూడెంట్ విసాపై దేశానికి వచ్చాడని అన్నారు. ఇప్పటివరకు తాము ఎన్నో డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నామని.. కానీ ఈ గ్యాంగ్ మాత్రం చాలా తెలివిగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఫేక్ అడ్రస్‌లతో బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేశారన్నారు. కేవలం ఆరు నెలల్లోనే.. రూ.4 కోట్ల లావాదేవీలు వీళ్ల అకౌంట్స్ ద్వారా జరిగాయని వెల్లడించారు. ఈ నిందితులంతా బెంగుళూరులో ఉండి, హైదరాబాద్‌కి డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్నారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న హైదరాబాద్‌కి చెందిన సంజయ్ కుమార్, తుమ్మ భాను తేజని కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశామని, వీళ్లిచ్చిన సమాచంతోనే ఈ ముఠాని పట్టుకున్నామని తెలిపారు.

Amitabh Bachchan: మక్కీకి మక్కీ దించేస్తే ఎలా సార్?