Nama Nageswara Rao Responds On Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఖమ్మం నామా నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. ఎన్నో ఆశలతో ఈ బడ్జెట్ కోసం ఎదురు చూశారని, కానీ రైతులకు అనుకూలంగా ఈ బడ్జెట్‌లో ఏమీ లేదని వ్యాఖ్యానించారు. అగ్రికల్చర్.. డిజిటల్ అగ్రికల్చర్‌తో అభివృద్ధి కాదని అభిప్రాయపడ్డారు. గత 9 ఏళ్లలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎంఎస్పీ గురించి ఒక్క మాట మాట్లాడలేదని దుయ్యబట్టారు. బడ్జెట్ మిల్లెట్స్ చుట్టూ తిప్పారన్నారు. మాయ మాటలు, మోసపు మాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కర్ణాటకలోనే కరువు ఉందని బీజేపీ చెప్తోందని ఫైర్ అయ్యారు. ఈ బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పన ఏది? అని నిలదీశారు. ఈ బడ్జెట్‌లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కూడా చెప్పలేదని పేర్కొన్నారు. మిషన్ భగీరథకు, నీతి అయోగ్ నిధులు ఇవ్వాలని తాము సూచించినా.. ఆ నిధుల్ని కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తపరిచారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, ప్రాజెక్టులకు అనుమతులు కూడా ఇవ్వట్లేదని బీజేపీపై నిప్పులు చెరిగారు. రూరల్ డెవప్మెంట్ ఏమైందని ప్రశ్నించిన ఆయన.. గ్రామ అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతున్నారు. తాము పార్లమెంట్‌లో ఈ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తామన్నారు.
Uttam Kumar Reddy: కేంద్ర బడ్జెట్‌పై ఉత్తమ్ ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్
అటు.. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇది కేవలం ఇది ఎన్నికల బడ్జెట్ మాత్రమేనన్నారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చామని చెప్తున్న కేంద్రం.. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉండి ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కర్ణాటకలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూ. 5,300 కోట్లు కేటాయించారన్నారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా గుజరాత్‌కు నిధులు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. బీజేపీది ఎన్నికల రాజకీయమని.. ఉద్యోగుల పన్ను మినహాయింపులో తిరకాసు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ వల్ల ఎవరికీ లాభం లేదని.. తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు.
MLC Kavitha: మోడీ ప్రభుత్వం విఫలమైందనడానికి ఈ బడ్జెటే ఉదాహరణ