NTV Telugu Site icon

ఈడీ నోటీసులపై.. ఎంపీ నామా ఆసక్తికర వ్యాఖ్యలు

తన సంస్థలు, ఇల్లు పై ఈడీ రైడ్స్, నోటీసులు జారీ చేసిన విషయంపై టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు ఎట్టకేలకు స్పందించారు. నా బలం కేసీఆర్… ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వెంటే ఉంటానని స్పష్టం చేశారు నామా.నేను ఎప్పడు జీవితంలో నీతి…నిజాయితీతో ఉంటున్నానని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని పేర్కొన్నారు. 40 ఏళ్ళ క్రితమే మధుకన్ ను స్థాపించానని… రాత్రిపగలు కష్టపడ్డానని వెల్లడించారు. మధుకన్ అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేసిందని.. ఏ కంపెనీలలో నేను డైరెక్టర్ గా లేనన్నారు నామా. రాంచీ ఎక్స్ ప్రెస్ వే ఎస్పివి కంపెనీ… BOT పద్ధతిలో ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు. నేషనల్ హైవే సంస్థ ప్రాజెక్టు పూర్తి కోసం ముందుకు వచ్చిందని.. కానీ విచారణల కారణంగా వెనక్కి వెళ్ళిపోయిందన్నారు. ఎస్క్రో అకౌంట్ పై బ్యాంకర్ కే పూర్తి పవర్ ఉందని.. విచారణకుకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. ట్రిబ్యునల్ లో మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని.. నేను డైరెక్టర్ ను కాదు…అయిన నాకు ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.