BRS Office: బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నల్గొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే నల్గొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయానికి మున్సిపల్ అనుమతి లేనందున కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసేలా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. ఇక, వాదనల సందర్భంగా కోర్టు.. అక్కడ కార్యాలయం నిర్మించే ముందు అనుమతి తీసుకోవాలని, కార్యాలయం కట్టిన తర్వాత అనుమతి ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం చట్టాన్ని ఉల్లంఘించడమే అని పేర్కింది. చట్టాన్ని ఉల్లంఘించి కార్యాలయ నిర్మాణం చేపట్టారన్నారు. అనంతరం నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది.
BJP MP Laxman: ప్రధాని మోడీ వంద రోజుల పాలన ట్రైలర్ మాత్రమే..
BRS Office: బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయండి.. 15 రోజులు టైం ఇచ్చిన హైకోర్టు..
- నల్లగొండలో బీఆర్‌ఎస్ ఆఫీసును కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది..
- 15 రోజుల్లోనే బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ..