NTV Telugu Site icon

Sunkishala: విరిగిపడ్డ సుంకిశాల రిటైనింగ్ వాల్.. త్రుటిలో తప్పిన ప్రమాదం..

Sunkala Water Fall

Sunkala Water Fall

Sunkishala: నాగార్జునసాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ ఆధారంగా హైదరాబాద్‌కు కృష్ణా నీటిని తరలించేందుకు చేపట్టిన ట్యాంకేజీ పథకంలో పెను ప్రమాదం తప్పింది. పథకంలో భాగంగా సొరంగాల్లోకి సాగర్ నీరు రాకుండా రక్షణగా నిర్మించిన కాంక్రీట్ రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కూలిపోయి సుంకిశాల పంప్ హౌస్ నీటిలో మునిగిపోయింది. నిత్యం వందమందికి పైగా కూలీలు పని చేసే స్థలం కళ్ల ముందే జలమయమైంది. ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందలాది మంది కూలీలు పనిచేస్తున్నారు. అదృష్టవశాత్తూ, కార్మికులు షిఫ్టులు మారుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం జరగలేదు.

Read also: Nagarjuna Sagar: తెరచుకున్న సాగర్ 26 క్రస్ట్ గేట్లు.. ప్రాజెక్టులకు జలకళ..

ఈ నెల 1వ తేదీ ఉదయం ఆరు గంటలకు ఘటన జరిగినా.. జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ ప్రమాదం అరగంట ముందు..ఆరు గంటల తర్వాత ముందే జరిగి ఉంటే.. భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నాగార్జునసాగర్‌కు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో పాటు నీటిమట్టం కూడా ఎక్కువగా ఉండడంతో రక్షణ గోడ వెనుక గేటు వేసి టన్నెల్‌ను పూర్తిగా తెరిచి ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. గేటు ఏర్పాటు పనులు పూర్తి స్థాయిలో జరగలేదని తెలిసింది. సాగర్‌లో నీటిమట్టం భారీగా తగ్గినా సుంకిశాల పనులు ప్రారంభం కాలేదు. ఎండాకాలం వరకు పనులు చేపట్టే అవకాశం లేదని స్పష్టం చేశారు.
RBI MPC Meet 2024: ముగిసిన ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం..రెపో రేటు యథాతథం

Show comments