NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy: రైతన్నకు భూమీ విషయంలో భయం లేకుండా చేస్తాం..

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy: రాబోయే రోజుల్లో ఏ ఒక్క రైతన్నకు భూమీ విషయంలో భయం లేకుండ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిరులమగిరి -సాగర్ మండలం, నెల్లికల్ లో.. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన ఫైలెట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సీఏల్పి నేత జానారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. మార్పు కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం పనిచేసి అధికారంలోకి వచ్చామన్నారు. యాచారం, తిరుమలగిరి మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. వాటి పరిష్కారంతో.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఒక్క రైతన్నకు భూమీ విషయంలో భయం లేకుండా చేస్తామన్నారు.

Read also: KTR Sensational Tweet: బతుకమ్మ, మూసీపై ట్వీటర్‌ వేదికగా ధ్వ‌జ‌మెత్తిన కేటీఆర్‌..

ధరణి పోర్టల్ తో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటలు ఆడిందన్నారు. ఇప్పుడు 2020 చట్టాన్ని సవరణ చేస్తూ.. ప్రజలకు అనువైన ఆర్.ఓ.ఆర్ చట్టం అమలు చేస్తామన్నారు. ఈ చట్టాల విషయంలో ప్రతిపక్ష పార్టీల సలహాలు, సూచనలు స్వీకరిస్థామన్నారు. అటవీ, రెవిన్యూ శాఖల మధ్య వివాదం ఉన్న భూమి సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. గత ప్రభుత్వ తప్పిదలతో.. భూమి లేకున్నా పాస్ పుస్తకాలు సృష్టించి రైతుబంధు పొందారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వo నిజమైన రైతులకు లబ్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. డిసెంబర్ నాటికి అర్హులైన పేదలకు ప్రభుత్వ భూముల పంచుతామన్నారు. అధికారం కోల్పోయిన ప్రస్ట్రేషన్ లో.. మాపై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
Online Betting: నిజామాబాద్‌ లో విషాదం.. బెట్టింగ్ బానిసై కుటుంబంతో సహా ఆత్మహత్య..

Show comments