NTV Telugu Site icon

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి..

Nagarjuna Sagar Projuct

Nagarjuna Sagar Projuct

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువలకు విడుదల చేస్తున్నారు అధికారులు. 20 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 2,17,724 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో : 2,59,730 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 2,59,730 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం: 588.50 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులుగా కొనసాగుతుంది.

Read also: Instagram: ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయం.. 20 రోజులు బంధించి యువతిపై లైంగిక దాడి..

ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ : 307.5790 టీఎంసీలుగా కొనసాతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలుగా ఉంది. సాగర్ గేట్ల ఎత్తివేయడంతో చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చి కృష్ణమ్మ అందాలను తిలకించారు. బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం, సమ్మక్క సారక్క, ప్రధాన ఆనకట్ట, శివాలయం ఘాట్, పవర్ హౌస్, ఉట్టిపిప్తల, అనుపు, కొత్త వంతెన, పాత వంతెన, ప్రధాన ద్వారాలు, కొత్త వంతెన తదితర ప్రాంతాలు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి.

Read also: 54th GST Council Meeting: నేడు ఢిల్లీలో 54వ జీఎస్టి కౌన్సిల్ సమావేశం.. హాజరుకానున్న భట్టి విక్రమార్క

రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండికి నీటి వరద కొనసాగుతుంది. జలాశయం ఏడు గేట్ల ద్వారా 19900 క్యూసెక్కుల నీరును వదులుతున్న అధికారులు. అన్నపూర్ణ జలాశయానికి 6400 క్యూసెక్కులు కాగా.. మీడ్ మానేరుకు ఎస్సారెస్పీ నుంచి 13 వేలు, మానేరు మూల వాగు నుంచి 2617 క్యూసెక్కుల ఇన్ఫ్లో.. మిడ్ మానేరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు (318 మీటర్లు) కాగా.. ప్రస్తుతం జలాశయంలో 23.11 టీఎంసీలు (316.20 మీటర్లు)గా కొనసాగుతుంది.
54th GST Council Meeting: నేడు ఢిల్లీలో 54వ జీఎస్టి కౌన్సిల్ సమావేశం.. హాజరుకానున్న భట్టి విక్రమార్క

Show comments