NTV Telugu Site icon

Nagarjuna Sagar: సాగర్‌ కు కృష్ణమ్మ పరవళ్లు.. చూసేందుకు పర్యాటకుల సందడి..

Nagarjuna Sagar

Nagarjuna Sagar

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జన సాగర్ లో సందడి చేస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి కిందకు పాలధారలా వస్తున్న కృష్ణానదిని చూసేందుకు జనం పోటెత్తారు. నాగార్జున సాగర్ 26 గేట్ల నుంచి పడుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు చూస్తున్నారు. కృష్ణమ్మ స్పిల్ వేలో పాలులా పాకుతోంది. సాగర్‌ క్రస్ట్‌ గేట్ల నుంచి కృష్ణమ్మ జలసమాధిని వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్ నీటి నాణ్యతను సంతరించుకుంది. నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతుండటంతో అధికారులు మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. 22 క్రస్ట్‌గేట్లను 5 అడుగులు, 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,60,691 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ సామర్థ్యం : 306.10 టీఎంసీలుగా ఉంది.

Read also: Telangana Crime: క్షణికావేశం.. ఒకరు కొడుకును చంపితే.. మరొకరు తండ్రిని హతమార్చాడు..

నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఎగువన శ్రీశైలం నుంచి వరద ఉధృతంగా ప్రవహించడంతో సాగర్‌ నిండుకుండలా మారి ఆనందాన్ని పంచుతోంది. గేట్ల నుంచి పాలవలె దూకుతున్న కృష్ణమ్మను చూసి ఆనందిస్తున్నారు. మరోవైపు, సాగర్ సమీపంలోని ఉత్తిపిట్టల జలపాతం సందర్శకుల దృష్టిని దోచుకుంటుంది. నీటి ప్రకృతి అందాలను తిలకించేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. రోడ్లపై ఎక్కడ చూసినా వాహనాలే దర్శనమిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్ల సుందర దృశ్యాలు నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో నీటి దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. డ్యామ్ పరిసరాలు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. దీంతో సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. సాగర్ అందాలను పర్యాటకులు సెల్ ఫోన్ లో బంధిస్తున్నారు.
Rakhi Festival: ఆడపడుచులకు ఆర్టీసీ బంపరాఫర్.. రాఖీల రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

Show comments