NTV Telugu Site icon

Nagarjuna Sagar: నేడు తెరుచుకోనున్న నాగార్జున సాగర్‌ గేట్లు..

Nagarjuna Sagar

Nagarjuna Sagar

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఇవాళ అధికారులు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నీటిని విడుదల చేసేందుకు అధికారుల ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి సాగర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తారు. ఇందుకోసం జలవనరుల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. 6 లేదా 8 క్రస్ట్ గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.

Read also: Thangalaan : తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయి: చియాన్ విక్రమ్

సాగర్ ఇన్ ఫ్లో: 2, 79,000 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో: 30,000 క్యూసెక్కులు. పూర్తి నీటి మట్టం: 590.00 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం: 580 అడుగులు. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 312.50 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 280 టీఎంసీకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. సాగర్ దిగువన ఉన్న కృష్ణా పరివాహక గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సాగర్ నిండిపోవడంతో ఆయకట్టు రైతులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

Read also: Thangalaan : తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయి: చియాన్ విక్రమ్

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగు నీటి విడుదలకు నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ నిర్ణయించింది. ఈనెల 7 నుంచి కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాలువల ద్వార నీటి విడుదల చేయనున్నారు అధికారులు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో జోన్ _1 పరిధిలో కాకతీయ కాలువ ద్వారా ఏడు రోజులు పాటు నీటి విడుదల చేయనున్నారు. జొన్ _2 పరిధిలో ఎల్.ఎం.డి వరకు 8 రోజుల పాటు నీటి విడుదల చేస్తారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 7.56 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు కొనసాగుతుంది.8 రోజుల పాటు అధికారులు నీటి విడుదల ప్రకటనతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Wayanad: వయనాడు ఘటనలో 308కి చేరిన మృతుల సంఖ్య..చైనా ప్రధాని సంతాపం

మహబూబ్ నగర్ జిల్లా జూరాలకు వరద ఉదృతి కొనసాగుతుంది. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 34 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో : 2,63,100 వేల క్యూ సెక్కులు.. ఔట్ ఫ్లో : 2,61,283 వేల క్యూ సెక్కులు.. పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు .. ప్రస్తుత నీటి నిల్వ :8.591 టీఎంసీలు.. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల చేపట్టారు