Nalgonda Crime నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. చింతలగూడెం గ్రామానికి చెందిన కోట రాజలింగం-రజిత కుమార్తె కోట కళ్యాణి(19) పాలిటెక్నిక్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్ద ఉంటుంది. ఆమెను అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. ప్రేమించాలని, లేకుంటే తమ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈ విషయం తెలిస్తే తన కుటుంబం పరువుపోతుందని కళ్యాణి భయపడింది. చివరకు ఆత్మహత్య చేసుకుంది.
Read also: Shivani Raja MP: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన శివానీ రాజా
ఈ నెల 6న కళ్యాణి తల్లిదండ్రులు తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి వెళ్లి తమ బంధువు మృతి చెందాడని అక్కడకు వెళ్లారు. ఇక తమ్ముడు కూడా కాలేజీకి వెళ్లాడు. దీంతో ఒంటరిగా ఉన్న కల్యాణిని యువకులు వేధించారు. మీరిద్దరూ నాకు స్నేహితులు అందుకే మీ ఇద్దరితో చనువుతోనే ఫోటోలు దిగానని తనకు ఆ ఉద్దేశం లేదని తెలిపింది. అయినా శివ, మధు.. కల్యాని మాటలు పట్టించుకోలేదు. ప్రేమించాలని, మేము చెప్పిన విధంగా చేయాలని లేదంటే మా ఇద్దరితో దిగిన ఫోటో వాట్సప్, ఇస్టాట్రామ్ లో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. ఎంతచెప్పిన ఈ ఇద్దరు యువకులు వేధించడంతో.. తాళలేక కల్యాణి పురుగుల మందు తాగింది. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.
అప్పటికే కళ్యాణి పురుగుల మందు తాగి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆమెను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న కల్యాణి మంగళవారం మృతి చెందింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన చావుకు ఇద్దరు యువకులే కారణమని యువతి చనిపోయే ముందు తన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అయితే కళ్యాణి ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే కుటుంబసభ్యులు గమనించి మధును ఆసుపత్రికి తరలించారు. మధును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనున్న పోలీసులు.
TG High Court: కమిటీని ఏర్పాటు చేయండి.. వీధి కుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం..