NTV Telugu Site icon

SLBC Incident: 23వ రోజు రెస్క్యూ ఆపరేషన్.. ఆటంకంగా బురద, నీటి ఊట

Slbc Tunnel Collapse

Slbc Tunnel Collapse

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్‌ 23వ రోజు కొనసాగుతుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్‌కు బురద, నీటి ఊట, టిబియం అవశేషాలు ఆటంకంగా మారాయి. ఈ క్రమంలో హైడ్రాలిక్ పవర్డ్ రోబోను 30 హెచ్ పి పంపుతో అనుసంధానం చేశారు. దీంతో.. వ్యాక్యూమ్ ట్యాంక్ తో బురదను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. డీ వాటరింగ్, టిబియం మిషన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి.

Read Also: AR Rahman: తీవ్ర అస్వస్థతకు గురైన ఏఆర్ రెహ్మాన్‌.. ఆస్పత్రికి తరలింపు!

శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC) టన్నెల్ నిర్మాణ సమయంలో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టన్నెల్‌లో గౌరావ్ పెనిట్రేటింగ్ రాడార్ (GPR), క్యాడవర్ డాగ్స్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి. రాడార్, శునకాలు గుర్తించిన ప్రదేశాలను డీ1, డీ2, డీ3 ప్రాంతాలుగా విభజించి అక్కడ తవ్వకాలు చేపట్టారు అధికారులు. డీ2 ప్రాంతంలో తవ్వకాలు జరిపిన రెస్క్యూ టీమ్స్ ఓ ఇంజనీర్ మృతదేహాన్ని వెలికితీశాయి. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంతమాత్రం అలసిపోకుండా, బృందాలు ఎప్పటికప్పుడు తమపనిని చురుకుగా కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.