NTV Telugu Site icon

SLBC: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. సాయంత్రానికి రెండు డెడ్ బాడీస్..!

Slbc Tunnel Collapse

Slbc Tunnel Collapse

శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC)లో జరిగిన విషాద ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో టన్నెల్ నిర్మాణ సమయంలో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టన్నెల్‌లో గౌరావ్ పెనిట్రేటింగ్ రాడార్ (GPR), క్యాడవర్ డాగ్స్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి. రాడార్, శునకాలు గుర్తించిన ప్రదేశాలను డీ1, డీ2, డీ3 ప్రాంతాలుగా విభజించి అక్కడ తవ్వకాలు చేపట్టారు అధికారులు. ఆదివారం నాడు డీ2 ప్రాంతంలో తవ్వకాలు జరిపిన రెస్క్యూ టీమ్స్ ఓ ఇంజనీర్ మృతదేహాన్ని వెలికితీశాయి.

Read Also: Jishnudev Varma: నేడు ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన.. దత్తత గ్రామానికి జిష్ణుదేవ్ వర్మ

మరో ఏడు మృతదేహాల కోసం సెర్చ్ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రానికి రెండు డెడ్ బాడీస్ తీసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డుపడుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) కట్టింగ్, నీటి తొలగింపు (డీ వాటరింగ్) పనులు కూడా నిరంతరం జరుగుతున్నాయి. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంతమాత్రం అలసిపోకుండా, బృందాలు ఎప్పటికప్పుడు తమపనిని చురుకుగా కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Read Also: Astrology: మార్చి 11, మంగళవారం దినఫలాలు