ఎస్ఎల్‌బీసీ (SLBC)టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 16వ రోజు కొనసాగుతుంది. జీపీఆర్ (GPR), క్యాడవర్ డాగ్స్లతో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీ వాటరింగ్, టీబీఎం మిషిన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్ ఆపరేషన్‌లో కీలక పురోగతి లభించింది. టీబీఎం మెషీన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆనవాళ్లు.. కుడి చేయి, ఎడమ కాలు భాగాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ఆ ప్రదేశంలో కట్టర్లతో కట్ చేస్తూ.. 8 అడుగుల మేర తవ్వకాలు జరుపుతున్నారు. చేతికి కడియంను బట్టి ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీగా నిర్థారించారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉంది.
Read Also: Champions Trophy Final: న్యూజిలాండ్తో ఫైనల్ ఫైట్.. కివీస్ కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న రోహిత్..?
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పని సమయంలో సంభవించిన ఘోర ప్రమాదం ఇంకా అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ ఘటనకు సంబంధించిన రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి.
Read Also: Bollywood : యాడ్ ద్వారా చిక్కులో పడిన స్టార్ హీరోలు