NTV Telugu Site icon

Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి.. గ్రామస్తులతో కలిసి దసరా వేడుకలు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: నేడు సొంతూరు కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్నున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండా రెడ్డి పల్లిలో దసరా పండుగ వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి జరుపుకోనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంత గ్రామానికీ వెళ్లనున్నారు. సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కొండారెడ్డి పల్లి గ్రామానికి చేరుకోనున్నారు. గ్రామస్తులతో కలిసి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ పాల్గొననున్నారు. కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నూతన గ్రామ పంచాయతీ, బీసీ భవనం, గ్రంథాలయం, పశువైద్య శాలలను ప్రారంభోత్సవం చేయనున్నారు. సౌర విద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు ఏర్పాట్లు చేశారు. నాలుగు కోట్ల రూపాయల సొంత నిధులతో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి వస్తుండటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Read also: Heavy Rains: తుఫాన్‌పై వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీతోపాటు తెలంగాణకు భారీ వర్షాలు

శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..

కొండారెడ్డి పల్లి గ్రామంలో రూ.50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు. బీసీ కమ్యూనిటీ హాల్ కొత్త గ్రామ పంచాయతీ, వెటర్నరీ మెడిసిన్ భవనం, కొత్త గ్రంథాలయ భవనం, ఆధునిక రైతు వేదిక, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ తదితర అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అలాగే గ్రామంలో అండర్ డ్రైనేజీ, నాలుగు లైన్ల రోడ్డు, సెంటర్ లైటింగ్, చిల్డ్రన్స్ పార్క్, జిమ్, దేవాలయం తదితర వాటికి సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతం, గ్రామంలో పర్యటన జరిగే ప్రదేశాలను ముందస్తుగా పోలీసుల ఆధీనంలోకి తీసుకుంటారు. సీఎంను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే అవాంఛనీయ సంఘటనలు, ఇతర సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులకు తగు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ తిరిగి హైదరాబాద్ వెళ్లేంత వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
Dussera 2024: దశమికి జ‌మ్మి చెట్టుకి ఉన్న సంబంధం ఏమిటి..?