NTV Telugu Site icon

అన్‌లాక్‌లో ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి…

ఈరోజు నుంచి తెలంగాణ‌లో అన్ని ఓపెన్ అయ్యాయి.  సాధార‌ణ స‌మ‌యాల్లో ఎలాగైతే ప‌నులు చేసుకునేవారో, ఇప్పుడు కూడా అదే విధంగా ప‌నులు చేసుకునేందుకు వీలు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  దీంతో ప్ర‌జ‌లు మ‌ళ్లీ రోడ్డెక్కుతున్నారు.  ఆ స‌మయంలో ప్ర‌తి ఒక్క‌రూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.  అన్‌లాక్ స‌మ‌యంలో అన‌వ‌స‌రంగా రోడ్ల‌మీద‌కు వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది.  అవ‌స‌ర‌మైతే త‌ప్పించి మిగ‌తా స‌మ‌యంలో ఇంట్లో ఉండ‌టం ఉత్త‌మం.  

ఒక‌వేళ రోడ్డుమీద‌కు వేళ్లాల్సి వ‌స్తే త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌లు తీసుకొని బ‌య‌ట‌కు వెళ్లాలి.  మాస్క్ పెట్టుకోవాలి.  శానిటైజ‌ర్‌ను వినియోగించాలి.  ప్ర‌తిరోజు శుభ్ర‌మైన మాస్క్‌ను వినియోగించాలి.  లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎలా జాగ్ర‌త్తగా ఉన్నారో, అన్‌లాక్ స‌మ‌యంలో కూడా అంతే జాగ్ర‌త్తగా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.