Site icon NTV Telugu

Musi Flood heavy floods: మూసీకి భారీ వదర.. లోతట్టు ప్రాంతాల్లో భయం భయం

Hussain Sagar Heavy Rain Water

Hussain Sagar Heavy Rain Water

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ఘటన మరిచిపోకముందే మళ్లీ వర్షాలు కురుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లకు భారీగా నీరు చేరడంతో.. గేట్లు తెరిచి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా 330 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు అలుగు పోస్తోంది. ఈ చెరువుకు కొంపల్లి, దూలపల్లి, గుండ్లపోచంపల్లి నుంచి పెద్ద ఎత్తున వరద వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. మూసీలోకి నీటిని విడుదలచేస్తుండటంతో.. ప్రజలు భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామని లోతట్టు ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. వర్షాలు తగ్గుముఖం ప‌ట్టాయి అనుకునేలోపే మళ్లీ కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కొనసాగింది. నైరుతి రుతుపవనాలతో పాటు ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో జూలై 27 (మరో ఐదు రోజులు) వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గ్రేటర్ హైదరాబాద్, మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు.

Fighter Jets for Ukraine: ఉక్రెయిన్‌కు అమెరికా యుద్ధ విమానాలు

Exit mobile version