HYDRA : హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు. చాదర్‌ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీ ఎస్ పరిసరాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను సమీక్షించారు. చాదర్‌ఘాట్‌లో మూసీ నది ముంచెత్తిన నివాస ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించిన కమిషనర్, స్థానికులకు నీటి మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
NTR-Kantara: టైగర్ రోర్స్.. ఒక్క ఈవెంట్, ఎన్నో అప్డేట్స్!
భవనాలపై చిక్కుకున్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహారం అందజేస్తున్న విధానాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఎంజీబీ ఎస్ వద్ద మూసీ నది రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో వరద ప్రవేశించిన ప్రాంతాలను కూడా కమిషనర్ పరిశీలించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా DRF సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.
అలాగే శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీ ఎస్ ప్రాంగణంలోకి వరద ప్రవేశించిన సమయంలో చేపట్టిన తక్షణ సహాయక చర్యలను ఆయన అభినందించారు. మూసీ వరదల దృష్ట్యా పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కొనసాగినప్పటికీ సాయంత్రం నాటికి నీటి మట్టం తగ్గే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. అయినా అప్రమత్తంగా DRF బృందాలు పర్యవేక్షణ కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
