Site icon NTV Telugu

Hyderabad Crime: హైదరాబాద్‌ లో దారుణం.. మర్డర్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్..!

Hyderabad Crime

Hyderabad Crime

Hyderabad Crime: హైదరాబాద్ లో పాతకక్షలే ఓ యువకుడి ప్రాణం తీశాయి. ఆ యువకుడిపై 10 నుంచి 11 కత్తితో పొడవడమే కాకుండా.. అతనిపై బండరాయితో తలపై మోది హత్య చేశారు. అంతటితో ఆగక ఆ మర్డర్ చేసిన కత్తి, రక్తంతో వున్న చేతితో వున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ లో హత్య చేసామని పోస్ట్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది.

Read also: Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

బాచుపల్లి పియస్ పరిధి ప్రగతినగర్ లో అర్దరాత్రి ఓ యువకుడి మర్డర్ జరిగింది. పాతకక్షలే కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు, స్దానికులు భావిస్తున్నారు. మృతుడు అలియాస్ సిద్దు గా పోలీసులు గుర్తించారు. ప్రగతినగర్ లోని బతుకమ్మకుంట వద్ద ఓ బిల్డింగ్ లో తన తల్లి, మామతో కలిసి సిద్దు నివాసం ఉంటున్నాడు. గత దసరా పండగ రోజు బొరబండలో జరిగిన అరుణ్ హత్యలో సిద్దు A3 నేరస్తుడుగా ఉన్నాడు. అయితే రెండు నెలల క్రితం సిద్దు జైల్ నుండి రిలీజ్ అయ్యాడు. అర్దరాత్రి సుమారు 3.30 సమయంలో గుర్తు తెలియని ముగ్గరు వ్యక్తులు సిద్దు ఇంటికి వెళ్లారు. గాఢనిద్రలో వున్న సిద్దును తీసుకుని బయట పని వుందని తీసుకుని తీసుకుని వచ్చారు అనంతరం అతనిపై ముగ్గరు మూకుమ్ముడిగా దాడి చేశారు. వారి వెంట తెచ్చుకున్న కత్తితో సిద్దును కిరాతకంగా హత్య చేసారు.

Read also: Yash Thakur-IPL 2024: ఐపీఎల్‌ 2024లో లక్నో బౌలర్ల హవా.. యశ్‌ ఠాకూర్ అరుదైన రికార్డు!

సిద్దు కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా.. శరీరంపై 11 కత్తిపోట్లతో విచక్షణారహితంగా పొడిచారు. సిద్దు కిందపడిపోవడంతో అతనిపై బండరాయితో తలపై మోది హత్య చేసారు. అనంతరం మర్డర్ చేసామని ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసారు. దీంతో సిద్దు హత్య నగరంలో వైరల్ గా మారింది. ఆరీల్ లో (ధగడ్ బోల్ రే.. సిద్దు బోల్ రే ) అంటూ అందులో రాసుకొచ్చారు. ఆ రాతలతో సాంగ్ క్రియేట్ చేసి స్టేటస్ పెట్టారు. అందులో వారు పొడిచిన కత్తి, రక్తంతో వున్న చేతులు, ఒక బైక్ పై ఇద్దరు కూర్చుని దారిలో వెళ్లడమేకాకుండా.. మరోచోటకు వెళ్లి ఆ కత్తిని మరొకతనికి చూపించడమే కాకుండా.. ఆపాటలకు స్టెప్పులేస్తూ నాలుక మడత పెడుతూ డాన్స్ చేసిన వీడియో పోస్ట్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ రీల్ చూసిన వారంతా భయాందోళన చెందుతున్నారు. పోలీసుల భయం లేకుండా ఇలాంటి వారు హత్యలు చేస్తూ సినిమాలోని సీన్ లాగా పోస్ట్ చేస్తున్నారంటే వారి వెనుక ఎలాంటి వ్యక్తులు ఉంటారు ఊహించుకోవచ్చని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సమచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్దు మృతదేహాన్ని పరిశీలించి, జాగిలాలు రప్పించగా అవి చుట్టుపక్కల తిరిగి ఆగిపోయాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.
USA: టీనేజ్ అబ్బాయిలే ఆమె టార్గెట్.. 14 ఏళ్ల బాలికగా నటిస్తూ పాడు పని..

Exit mobile version