Love Marriage : ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువకుడి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ వివాహం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఓ యువకుడిని యువతి తరుపు బంధువులు దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన ఓ యువకుడు (25), అదే జిల్లా పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్‌కు చెందిన యువతి (23) ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. అయితే.. వీరు.. ఇంట్లో వారికి ఈ విషయం తెలిసి పెళ్లి నిరాకరించడంతో.. వారు పారిపోయి.. ఓల్డ్ సిటీ లాల్‌దర్వాజాలోని ఆర్య సమాజంలో ఈ ఏడాది జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకున్న జంట సరూర్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని జీవన సాగుస్తున్నారు. అయితే యువకుడు మలక్‌పేటలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.
Also Read
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?
అయితే నిన్న రాత్రి 9గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్‌పై వీఎం హోం నుంచి సరూర్‌నగర్ పోస్టాఫీస్ వైపు వెళుతుండగా.. బైక్‌పై వచ్చిన దుండగులు బైక్‌కు అడ్డం వచ్చారు. యువకుడి హెల్మెట్‌ను తీయించి సెంట్రింగ్ రాడ్‌తో అతనిపై దాడి చేశారు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలై రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. మతాంతర వివాహం నేపథ్యంలో యువతి బంధువులే ఈ పాశవిక హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి జరిగిన నాటి నుంచి కక్ష పెంచుకున్న యువతి సోదరుడు, అతని బావలు కలిసి యువకుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల యువతి తరఫు బంధువులు తమను వెంబడించడంతో, తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ దంపతులు వికారాబాద్, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
-
Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
-
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!