NTV Telugu Site icon

Munugode by poll: బూర నర్సయ్య గౌడ్‌ కు నిరసన సెగ.. డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు

Buranarasayya Goud

Buranarasayya Goud

Munugode by poll: తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతోంది. రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ రాజకీయాలు సైతం మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. పార్టీనేతలంతా మునుగోడులో నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. ఇటీవలె టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో వెళ్లిన బూరనర్సయ్య గౌడ్‌ కు నిరసన సెగ ఎదురైంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో బీజేపీ తరుపున ప్రచారానికి వెళ్లిన బూర నర్సయ్య గౌడ్‌ ను టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బూరనర్సయ్య గౌడ్‌ డౌన్‌ డౌన్‌ అంటూ టీఆర్‌ ఎస్‌ నేతలు నినాదాలు చేశారు. దీంతో.. చౌటుప్పల్‌ మండలం జే.కేసర్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అదుపులో తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు.

Read also: China On Taiwan: తైవాన్ విషయంలో చైనా కీలక చర్య.. స్వాతంత్య్రం ఇక కష్టమే..

ఈనెల 19న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో బూరనర్సయ్య గౌడ్‌ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న విషయం తెలిసిందే.. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో తనను పార్టీ సంప్రదించలేదని బూర నర్సయ్య గౌడ్ అసంతృప్తితో వున్నారు. టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వచ్చారు బూర నర్సయ్యగౌడ్. తనకు పార్టీలో అవమానం జరిగిందని, తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదంటూ అందుకే రాజీనామా చేసినట్లు బూర నర్సయ్య గౌడ్‌ వివరించారు.
Salman Khan: సల్మాన్ ఖాన్ కు డెంగ్యూ.. జయం రవికి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

Show comments