Jagadish Reddy: కోమటి రెడ్డి కుటుంబాన్ని బీజేపీ కొనుక్కుందని రాష్ట్రమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో తెచ్చిన అతనికీ, కారణం అయిన వారు సరిగ్గా చెప్పలేక పోతున్నారన్నారు. ఒక వ్యక్తి యొక్క స్వార్థం, బీజేపీ రాజకీయ కుట్రతో ఈ ఎన్నిక వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుందని జగదీష్ రెడ్డి తెలిపారు. బీజేపీ దేశ వ్యాప్తంగా బలహీన మవుతుందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలం అయిందని అన్నారు. ప్రజలను మోసం చేయలేమని ఆ పార్టీకి అర్థం అయిందని అన్నారు. రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయాలని అనుకుంటుందని మండిపడ్డారు. కేసీఆర్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం కనిపిస్తుంది.. వారికి భయం కలుగుతుందని జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించ బోతోందని తెలిపారు. కేసీఆర్ పేరును గుజరాత్ లో, ఇతర రాష్ట్రాల్లో వినడం మోడీ..అమిత్ షా లకు ఇష్టం లేదని తెలిపారు. కేసీఆర్‌ను తెలంగాణకే పరిమితం చేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు.
Read also: Gujarat: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా ఫైన్ లేదు.. గుజరాత్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
కేసీఆర్ పథకాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయని తెలిపారు. మునుగోడు ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించింది సీఎం కేసీఆర్ యే అన్నారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది కేంద్ర మంత్రి పార్లమెంట్ లో మిషన్ భగీరథ ద్వారా ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పారు. కాళేశ్వరం మొదటి పలితం తీసుకుంది కూడా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నుంచే అన్నారు. వ్యక్తులకు ఉన్న సానుభూతి తోనే బీజేపీ రెండు సీట్లను గెలిచిందని అన్నారు. కేసీఆర్‌ను అడ్డుకునేందుకే, కాంగ్రెస్ నీ బలహీన పర్చాలని బీజేపీ వేసిన ఎత్తుగడ అని విమర్శించారు. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి 3 యేళ్ళుగా బీజేపీతో టచ్ లో ఉన్న అని చెప్పుకున్నాడని తెలిపారు. ఆయన కాంట్రాక్ట్ కోసం కుటుంబ స్వార్థం కోసం బీజేపీలో చేరారని తెలిపారు. నాలుగు ఏళ్లుగా రాజ్ గోపాల్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేడని తెలిపారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్‌ను దగ్గరికి వెళ్లగలిగే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని మునుగోడు ప్రజలను కోరుతున్నా మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
Allu Sneha Arjun: అల్లు అర్జున్ భార్యకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం ఉండదట