NTV Telugu Site icon

Big Breaking: మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం

Trs Candidate

Trs Candidate

మునుగోడు ఫలితం బీజేపీకి షాకిచ్చింది. ఉప ఎన్నిక కౌంటింగ్ ముగిసింది. మునుగోడులో 10,309ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ కి 95,028 ఓట్లు, బీజేపీకి 85,128 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ పార్టీ కేవలం 23,601 ఓట్లు మాత్రమే సాధించింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా సాగింది. హోరాహోరీ పోరులో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 686 పోల్ అయ్యాయి. టీఆర్‌ఎస్‌కు 228, బీజేపీకి 224, బీఎస్పీకి 10, ఇతరులకు 88 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. టీఆర్ఎస్ 11,666 ఓట్ల మెజారిటీ సాధించింది.
Read ALso: Plane Crash: టాంజానియాలో ఘోర ప్రమాదం.. విక్టోరియా సరస్సులో కూలిన ప్రయాణీకుల విమానం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న గిడ్డంగులశాఖ గోడౌన్‌లో లెక్కింపు జరిగింది. విశాలమైన కౌంటింగ్‌ హాల్‌లో మొత్తం 21 టేబుళ్లపై ఏకకాలంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలు ఉన్న మునుగోడు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తి అయింది. మునుగోడు ఉపఎన్నికలు ఈనెల 3న జరగగా, రికార్డు స్థాయిలో 93.13శాతం పోలింగ్‌ నమోదైంది. 2,41,805 ఓట్లకుగాను మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయి.

ఈ ఎన్నికల్లో ఆదినుంచి ప్రకటించినట్టుగానే టీఆర్ఎస్ గెలిచింది. రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. 14వ రౌండ్‌ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 10వేలకు పైగా మెజారిటీని సాధించింది. 14వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 6608, బీజేపీ 5553 ఓట్లు సాధించాయి. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 1055 ఓట్ల లీడ్ రాగా.. ఓవరాల్‌గా 10191 ఓట్ల మెజారిటీని సాధించింది.

2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 22 వేల మెజారిటీ లభించింది. ఈ ఉప ఎన్నికలో తనదే విజయం అని భావించిన రాజగోపాల్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన సీటును కోల్పోయారు. అటు కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. ఈ ఉప ఎన్నికలో ఘన విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ భవన్ అంతటా సంబరాలతో హోరెత్తుతోంది. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓట‌మిని చ‌వి చూసింది. క‌నీసం డిపాజిట్‌ను కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. 15 రౌండ్లలో ఏ ఒక్క రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌లేదు. మొద‌టి నుంచి చివ‌రి రౌండ్ వ‌ర‌కు మూడో స్థానంలోనే ఉండిపోయింది. పాల్వాయి స్రవంతి డిపాజిట్ ద‌క్కించుకోవాలంటే 37,532 ఓట్లు రావాలి. కానీ అన్ని ఓట్లు రాలేదు.

Read Also:Harish Rao : కేసీఆర్‌ వెంటే తెలంగాణ ప్రజలు