Site icon NTV Telugu

Munugode Bypoll: నేడే మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ

Munugode Bypoll

Munugode Bypoll

Munugode Bypoll: నేడే నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి 14 వరకుకొనసాగనున్నది. అందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే… స్థానిక తాసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, ఎన్నికల రిటర్నరింగ్‌ అధికారిగా జగన్నాథరావు వ్యవహరించనున్నట్లు కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ప్రకటించారు… ఎన్నికల కోడ్‌ ఈనెల 3నుంచే అమల్లోకి వచ్చిన విషయం తెలిస్సిందే. కాగా, ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తాసీల్దార్‌ కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు మీటర్ల దూరం వరకు బారికెడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్‌ దాఖలు చేసే వ్యక్తితో కలిసి ఐదుగురికి మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు… వారి వాహనాల పార్కింగ్‌ కోసం స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేశారు… నియోకవర్గంలో ఏర్పాటు చేసిన 6 చెక్‌పోస్టుల్లో నిరంతం తనిఖీలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Read also: Vijayashanti : కేసీఆర్ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి

అక్టోబర్‌ 3న మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీహార్‌లోని రెండు స్థానాలకు, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలోని ఒక్కో అసెంబ్లీ స్థానంతో పాటు తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి షెడ్యూల్‌ ప్రకటించి ఈసీ. ఆ షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుండగా అక్టోబర్ 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా, నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ గడువుగా పెట్టారు. ఇక, నవంబర్‌ 3వ తేదీన పోలింగ్‌ జరగనుండగా నవంబర్‌ 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. నవంబర్‌ 8వ తేదీతో ఉప ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుంది.
Ind vs SA: మొదటి వన్డే సఫారీలదే.. సంజు శాంసన్‌ పోరాటం వృథా

Exit mobile version