Komatireddy Raj Gopal Reddy: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Raj Gopal Reddy: నేను తప్పుచేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు వుంటే మీడియా ముందు తీసుకురండని సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన ఎన్టీవీతో మాట్లాడారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ లలో బీజేపీ పార్టీ బలం పెరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల విశ్వాసం కోల్పోయిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. 12 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే పార్టీ మారారో అప్పుడే ప్రజల విశ్వాసం కోల్పోయిందని సంచళన వ్యాఖ్యాలు చేశారు.
ప్రజలు మోడీ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. అవినీతిత పాలన కుటుంబ పాలన పోవాలంటే ఇది బీజేపీతోనే సాధ్యమని ఇప్పుడు మునుగోడు ఎన్నిక రావడం జరిగిందని అన్నారు. ఇది ఒక వ్యక్తికోసమో, ఎమ్మెల్యే పదివి కోసమో వచ్చిన ఎన్నిక కాదుని అన్నారు. మునుగోడులో వచ్చే తీర్పుతోనే తెలంగాణలో మార్పు వస్తుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. తప్పకుండా ఈ ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు ధర్మం వైపు వుంటారని ఒక చరిత్రలో మిగిలిపోయే తీర్పు ఇస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించిన ఎన్నిక అని, తెలంగాణ ప్రజల తలరాతను మార్చే ఎన్నిక కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరూ నడుం బిగించాలని అన్నారు. కుటుంబ పాలన చేసుకుంటూ దోచుకుంటున్న కుటుంబానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసి తెలంగాణాని కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పించాలని తెలంగాణ ప్రజలందరికి కోరుకుంటున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
Read also:Ola Electric : ఓలా నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్: ధర రూ. 80వేలు మాత్రమే
ఆరోపణలపై 1986 నుంచి తన సోదరుడు అనిల్ రెడ్డి తో మేము చేసిన వ్యాపారం వుందని అది పెద్ద సంస్థఅని రాజకీయాల్లో రాకముందే మేము వ్యాపారంలో వున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే ఉద్యమంలో కేసీఆర్ కు కావాలంటే కోట్ల రూపాయలు ఇచ్చినాం అన్నారు. కోట్లు ఇచ్చినప్పుడు ఆరోజు ఏమీ మాట్లాడని వాల్లు ఇప్పుడు నీతి నిజాయితీతో మా కంపెనీ నడుస్తుంది, 5వేల మంది ఉద్యోగస్తులు వున్నారు దేశవ్యాప్తంగా చైనా బార్డర్ల రోడ్లు వేస్తున్నాం మైనింగ్ పనిచేస్తున్నాం సింగరేణి కాలనీస్ లో పనిచేస్తున్నా ఇలా ఎన్నో రకాల పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కొలేక నాకున్న మంచి పేరును చెడగొట్టాని చూస్తున్నారని మండిపడ్డారు. అమ్ముడు పోయారని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్ముడు పోయిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల్లో పోయి ఓట్లు అడుగుతాడా? అంటూ ప్రశ్నించారు. స్వార్థపరునికి అంత ధైర్యం వుంటదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 12 మంది ఎమ్మెల్యేలను ఎట్లా కొనుక్కున్నారు? ప్రశ్నించారు. ఏమిచ్చి కొనుక్కున్నావని ప్రశ్నలు గుప్పించారు.
90 మంది ఎమ్మెల్యేలు వున్న తరువాత ప్రశ్నించకుండా గొంతునొక్కున దుర్మార్గుడివి నువ్వు అంటూ మండిపడ్డారు. వీరి పరిపాలన నియంత పరిపాలన అంటూ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం జైల్లో వుండటం ఖాయం. నేను తప్పుచేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సంచళన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు వుంటే మీడియా ముందు తీసుకురండని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి చిల్లరగాడు అతని గురించి మాట్లాడదలుచుకోలేదుని మండిపడ్డారు. అతనొక బ్లాక్ మైనర్ నాగురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి చీము, నెత్తురు, సిగ్గు, సరం వుంటే ఏమి ఎంక్విరీ చేస్తావో చెయ్ అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ దొంగలను పెంచిపోసిస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాదర్ కిషోర్ ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, లాండ్ మాఫియా చేస్తాడు అంటూ ఆరోపించారు. రుజువులుంటే ముందుకు రావాలని అన్నారు ఎటువంటి దానికైనా సిద్దమని అన్నారు. నన్ను కొనేశక్తి ఈప్రపంచంలో పుట్టలేదు పుట్టబోదని అమిషా మీటింగ్ లోనే సభా ముఖంగా తెలిపానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మా మునుగోడు ప్రజలు తలవంచుకునే పని ప్రాణంపోయినా నేను చేయను అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
Supreme Court: ‘జాతీయ జంతువుగా ఆవు’ పిటిషన్ కొట్టివేత
తాజావార్తలు
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?