Komatireddy Raj Gopal Reddy: సంచలన వ్యాఖ్యలు.. ఉద్యమానికి సీఎం కేసీఆర్‌కు కోట్లు ఇచ్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komati reddy Rajagopal reddy: నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజగోపాల్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. 1986 నుంచి తన సోదరుడు అనిల్ రెడ్డి తో మేము చేసిన వ్యాపారం వుందని అది పెద్దసంస్థ అని రాజకీయాల్లో రాకముందే మేము వ్యాపారంలో వున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే ఉద్యమంలో కేసీఆర్ కు కావాలంటే కోట్ల రూపాయలు ఇచ్చినాం అన్నారు. కోట్లు ఇచ్చినప్పుడు ఆరోజు ఏమీ మాట్లాడని వాల్లు ఇప్పుడు నీతి నిజాయితీతో మా కంపెనీ నడుస్తుంటే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 5వేల మంది ఉద్యోగస్తులు వున్నారు దేశవ్యాప్తంగా చైనా బార్డర్ల రోడ్లు వేస్తున్నాం మైనింగ్ పనిచేస్తున్నాం. సింగరేణి కాలనీస్ లో పనిచేస్తున్నాం.. ఇలా ఎన్నో రకాల పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కొలేక నాకున్న మంచి పేరును చెడగొట్టాని చూస్తున్నారని మండిపడ్డారు. అమ్ముడు పోయారని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమ్ముడు పోయిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల్లో పోయి ఓట్లు అడుగుతాడా? అంటూ ప్రశ్నించారు. స్వార్థపరునికి అంత ధైర్యం వుంటదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 12 మంది ఎమ్మెల్యేలను ఎట్లా కొనుక్కున్నారు? ప్రశ్నించారు. ఏమిచ్చి కొనుక్కున్నావని ప్రశ్నలు గుప్పించారు. 90 మంది ఎమ్మెల్యేలు వున్న తరువాత ప్రశ్నించకుండా గొంతునొక్కున దుర్మార్గుడివి నువ్వు అంటూ మండిపడ్డారు. వీరి పరిపాలన నియంత పరిపాలన అంటూ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం జైల్లో వుండటం ఖాయం. నేను తప్పుచేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సంచళన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు వుంటే మీడియా ముందు తీసుకురండని సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబానికి చీము, నెత్తురు, సిగ్గు, సరం వుంటే ఏమి ఎంక్విరీ చేస్తావో చెయ్ అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ దొంగలను పెంచిపోసిస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాదర్ కిషోర్ ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, లాండ్ మాఫియా చేస్తాడు అంటూ ఆరోపించారు. రుజువులుంటే ముందుకు రావాలని అన్నారు ఎటువంటి దానికైనా సిద్దమని అన్నారు. నన్ను కొనేశక్తి ఈప్రపంచంలో పుట్టలేదు పుట్టబోదని అమిషా మీటింగ్ లోనే సభా ముఖంగా తెలిపానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మా మునుగోడు ప్రజలు తలవంచుకునే పని ప్రాణంపోయినా నేను చేయను అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
Supreme Court: ‘జాతీయ జంతువుగా ఆవు’ పిటిషన్ కొట్టివేత
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!