NTV Telugu Site icon

Komatireddy Raj Gopal Reddy: సంచలన వ్యాఖ్యలు.. ఉద్యమానికి సీఎం కేసీఆర్‌కు కోట్లు ఇచ్చాం

Kcr, Rajagoplareddy

Kcr, Rajagoplareddy

Komati reddy Rajagopal reddy: నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజగోపాల్‌ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. 1986 నుంచి తన సోదరుడు అనిల్ రెడ్డి తో మేము చేసిన వ్యాపారం వుందని అది పెద్దసంస్థ అని రాజకీయాల్లో రాకముందే మేము వ్యాపారంలో వున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే ఉద్యమంలో కేసీఆర్‌ కు కావాలంటే కోట్ల రూపాయలు ఇచ్చినాం అన్నారు. కోట్లు ఇచ్చినప్పుడు ఆరోజు ఏమీ మాట్లాడని వాల్లు ఇప్పుడు నీతి నిజాయితీతో మా కంపెనీ నడుస్తుంటే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 5వేల మంది ఉద్యోగస్తులు వున్నారు దేశవ్యాప్తంగా చైనా బార్డర్ల రోడ్లు వేస్తున్నాం మైనింగ్‌ పనిచేస్తున్నాం. సింగరేణి కాలనీస్‌ లో పనిచేస్తున్నాం.. ఇలా ఎన్నో రకాల పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కొలేక నాకున్న మంచి పేరును చెడగొట్టాని చూస్తున్నారని మండిపడ్డారు. అమ్ముడు పోయారని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్ముడు పోయిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల్లో పోయి ఓట్లు అడుగుతాడా? అంటూ ప్రశ్నించారు. స్వార్థపరునికి అంత ధైర్యం వుంటదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 12 మంది ఎమ్మెల్యేలను ఎట్లా కొనుక్కున్నారు? ప్రశ్నించారు. ఏమిచ్చి కొనుక్కున్నావని ప్రశ్నలు గుప్పించారు. 90 మంది ఎమ్మెల్యేలు వున్న తరువాత ప్రశ్నించకుండా గొంతునొక్కున దుర్మార్గుడివి నువ్వు అంటూ మండిపడ్డారు. వీరి పరిపాలన నియంత పరిపాలన అంటూ ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం మొత్తం జైల్లో వుండటం ఖాయం. నేను తప్పుచేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సంచళన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు వుంటే మీడియా ముందు తీసుకురండని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ కుటుంబానికి చీము, నెత్తురు, సిగ్గు, సరం వుంటే ఏమి ఎంక్విరీ చేస్తావో చెయ్‌ అంటూ సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ దొంగలను పెంచిపోసిస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాదర్‌ కిషోర్‌ ఇసుక మాఫియా, గ్రానైట్‌ మాఫియా, లాండ్‌ మాఫియా చేస్తాడు అంటూ ఆరోపించారు. రుజువులుంటే ముందుకు రావాలని అన్నారు ఎటువంటి దానికైనా సిద్దమని అన్నారు. నన్ను కొనేశక్తి ఈప్రపంచంలో పుట్టలేదు పుట్టబోదని అమిషా మీటింగ్‌ లోనే సభా ముఖంగా తెలిపానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మా మునుగోడు ప్రజలు తలవంచుకునే పని ప్రాణంపోయినా నేను చేయను అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు.
Supreme Court: ‘జాతీయ జంతువుగా ఆవు’ పిటిషన్‌ కొట్టివేత