Site icon NTV Telugu

విద్యుత్ అధికారులపై వార్డు కౌన్సిలర్ల వీరంగం

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో విద్యుత్ అధికారుల పై మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు వీరంగం చేశారు. సబ్ స్టేషన్ ఆవరణలో షెడ్ల నిర్మాణానికి మున్సిపల్ ఆధ్వర్యంలో భూమి పూజ చేస్తున్న క్రమంలో తమకు సమాచారం లేకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించిన విద్యుత్ అధికారుల పై వార్డు కౌన్సిలర్ లు రెవెళ్లి మహేష్,వేల్పుల సుధాకర్, జగన్నాథుల శ్రీనివాస్, పెండ్యాల లక్ష్మణ్ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ దాడిచేశారని విద్యుత్ అధికారులు తెలిపారు.

తమ ఉద్యోగులు పాషా, సృజన్ పై దాడి చేశారని…దాడికి నిరసనగా విద్యుత్ సరఫరాను నిలిపివేశామన్నారు అధికారులు. వార్డు కౌన్సిలర్ల పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విద్యుత్ శాఖ అధికారులు.

Exit mobile version