హాట్ పాలిటిక్స్ కి కేరాఫ్ అడ్రస్ ఖమ్మం జిల్లా. ఇక్కడ అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ వివాదం స్థానిక మునిసిపాలిటీలలోనూ కనిపిస్తుంది. తాజాగా ఇల్లెందు మునిసిపాలిటీలో వివాదం రాజుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశానికి 11 మంది కౌన్సిలర్లు నల్ల కండువాలతో హాజరై నిరసన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కు 11 మంది కౌన్సిలర్లకు మధ్య వివాదం నడుస్తోంది. ఛైర్మన్ తమ వార్డులో అభివృద్ధి చేయడం లేదని, మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కులం పేరుతో దూషిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీఎంవో, రాష్ట్ర హైకోర్టు, జిల్లా కలెక్టర్, హ్యూమన్ రైట్స్ కమిషన్ ,ఎస్సీ ఎస్టీ కమిషన్, ఐటి శాఖ మంత్రి కి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదులు చేశారు.
Read Also: CM KCR: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి 11 మంది అసమ్మతి కౌన్సిలర్ నల్ల కండువాలతో వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మినిట్స్ బుక్ చూపించమని అడగగా చైర్మన్ మీకు చూపించాల్సిన అవసరం లేదన్నారు. తొలుత సమావేశ మందిరం నుంచి బయటికి వెళ్లి పోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నేనే బాస్ నేను చెప్పిందే వేదమని ఎదురు ప్రశ్న వేయడానికి వీల్లేదని ఫస్ట్ సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లి పోవాలని ఆదేశించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశ హాలు ముందు బైఠాయించారు. అనంతరం చైర్మన్ వ్యవహార శైలిపై కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తామన్నారు.
Read Also: Father abuses daughter: కన్నబిడ్డపై తండ్రి అఘాయిత్యం.. ఎవరికైనా చెప్తే అమ్మను..!