Father abuses daughter: కన్నబిడ్డనే ఓ కసాయి తండ్రి దారుణానికి ఒడిగట్టిన ఘటన పంజాబ్ లో పంజాబ్వెలుగుచూసింది. కనిపెంచిన కూతురిపైనే కన్న తండ్రే త అత్యాచారం చేశాడు. దీంతో ఆ చిన్నారి గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఎవరికైనా తన గురించి తెలుస్తుందేమో అని భావించిన తండ్రి తన పాపాన్ని కడిగేసుకోవాలని ఆ శిశువును కాలువలో విసిరేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు గమనించి అడ్డుకున్నారు. ఆతండ్రి వద్దనుంచి చిన్నారిని లాగేసుకొన్నారు. అసలు ఏంజరిగింది అనే విషయంపై బాలికను ప్రశ్నించగా విస్తుపోయే నిజాన్ని బయటపెట్టింది.
వివరాల్లోకి వెళితే.. జలంధర్‌లోని లెదర్ కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన 14 సంవత్సరాల ఓ బాలికపై ఆమె తండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే, గత కొంత కాలంగా తండ్రే తనపై అత్యాచారం చేస్తున్నట్లు బాలిక వెల్లడించింది. తనను గత కొంత కాలంగా తండ్రే అత్యాచారం చేస్తున్నారని తెలిపింది. దీంతో ఈ విషయం ఎవరికైనా చెప్తే అమ్మని, తనని ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. ఆభయం వల్లే ఇంత జరిగినా ఈ విషయం ఎవరికీ చెప్పలేదని వాపోయింది బాధితురాలు.
అయితే.. మరోవైపు బాలిక తల్లి కూడా మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా నా భర్త డ్రగ్స్‌కి బానిస అయ్యాడు. తన కూమారై జీవితాన్ని నాశనం చేశాడని, భర్తను కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. అయితే.. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించి, బాలికను, ఆమెకు పుట్టిన శిశువును ఆసుపత్రికి తరలించారు. దీంతో.. శిశువు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, జలంధర్ సివిల్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అయితే.. అప్పటికే గ్రామస్థులు భారీగా ఆసుపత్రికి తరలి రావడంతో.. నిందితుడ్ని గ్రామస్థులు కొడతారేమో అన్న అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని జలంధర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు స్టేషన్హౌస్ఆఫీసర్ కమల్జిత్ తెలిపారు. ఇక బాలిక వాంగ్మూలం తీసుకున్నాక నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని స్టేషన్హౌస్ఆఫీసర్ తెలిపారు.
Ram Charan : హీరో’ బ్రాండ్ అంబాసిడర్‌గా చరణ్!