Site icon NTV Telugu

సీఎం కేసీఆర్ పై మంద కృష్ణ మాదిగ ఫైర్

ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై నిన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు నుండి ఈ నెల 10తేదీ వరకు అంబేద్కర్ విగ్రహల వద్ద నిరసనగా కార్యక్రమాలు చేపడతామన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

https://ntvtelugu.com/dk-aruna-made-sensational-comments-on-cm-kcr/

సీఎం కేసీఆర్ తో రాజ్యాంగంపై చర్చించేందుకు ఎమ్మార్పీఎస్ సిద్ధంగా ఉందన్నారు. పాలకులు తమ వైఫల్యాలను, రాజ్యాంగంపై ఆపాదించడం సీఎం కేసీఆర్ నిరంకుశత్వానికి నిదర్శనం అన్నారు. సీఎం కేసీఆర్ ఒక నియంతృత్వ రాజ్యాంగాన్ని తీసుకురావటానికి ముందు వరుసలో ఉన్నారు.

ఒక దళితుడు రాసిన రాజ్యాంగం ఇంకా ఎన్ని రోజులు ఉండాలి అని సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉంది. దళితుల పట్ల సీఎం కేసీఆర్ ఉన్న ప్రేమ ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్రాల ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. ఆ రాజ్యాంగం వల్లే ఇప్పుడు సీఎం కేసీఆర్ రాష్టాన్ని పారిపాలిస్తున్నాననే సంగతి మరిచ్చిపోయాడన్నారు.

ప్రజల్లో కేసీఆర్ పాలనపై రోజురోజుకు అసహనం పెరిగి పోతుంది. రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య హక్కులు ప్రజలకు ఉంటే తమపై నిరసన వ్యక్తం చేస్తారని రాజ్యాంగాన్నీ మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారన్నారు.

Exit mobile version