Site icon NTV Telugu

తెలంగాణ ఏర్పాటు తర్వాతే నీటి దోపిడి ఎక్కువైంది: ఉత్తమ్

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన కొత్త పీసీసీ కమిటీకి అభినందనలు తెలిపారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ చీఫ్ గా ఉండకపోయినా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు. ధీర్ఘకాలం పాటు తనకు పీసీసీ చీఫ్ గా పనిచేసే అవకాశం కల్పించిన సోనియాగాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని.. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. పోలీసుల వేధింపులను తట్టుకొని నిలబడ్డ కార్యకర్తలకు సెల్యూట్ అని ఆయన చెప్పారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాతే నీటి దోపిడి ఎక్కువైందని కేసీఆర్ ప్రభుత్వంపై ఉత్తమ్ విమర్శించారు. నీటి దోపిడిపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని తెలిపారు. పోతిరెడ్డి పాడు నుండి 4 టీఎంసీల నుండి 8 టీఎంసీలకు నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోంటే తెలంగాణ సర్కార్ అడ్డుకోకపోవడం దుర్మార్గమైన చర్యగా ఉత్తమ్ అభివర్ణించారు.

Exit mobile version