NTV Telugu Site icon

Santhosh Kumar: 2023 క్యాలెండరును ఆవిష్కరించిన ఎంపీ సంతోశ్​ కుమార్

Joganapalli Santhosh Kumar

Joganapalli Santhosh Kumar

MP Santosh Kumar unveiled the 2023 calendar: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిత్యం సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ గా వుంటారు. తన కెమెరా కన్నులతో బంధించిన అందమైన పక్షులు, జంతువుల ఫోటోలను వీక్లీ డోస్ ఆఫ్ మై ఫోటోగ్రఫీ పేరుతో ట్విట్టర్ ద్వారా షేర్ చేసే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆసక్తికరమైన ట్వీట్ చేస్తూ ప్రకృతి ఆనందాలను దగ్గరచేస్తుంటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా ఒక మహాయజ్ఞంలా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై ప్రకృతిపై తమ ప్రేమను చాటుకుంటు దానికి తగ్గట్టుగా ప్రకృతి ప్రేమికులు చెట్లను నాటుతూ వాటిని పరీరక్షిస్తూ పర్యావరణంకు తమ వంతు సహాయం అందిస్తున్నారు.

Read also: Kamareddy Master Plan: మాస్టర్ ప్లాన్ పై నేడు మరో సారి హైకోర్టులో విచారణ.. రైతుల్లో ఉత్కంఠ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌​ కుమార్ చేస్తున్న కృషి అందరికి స్ఫూర్తివంతంగా ముందుకు సాగుతున్నారు. మిగతా ప్రపంచంతో నాకు సంబంధం లేదంటూ ప్రకృతిలో పరవశిస్తున్నట్లుగా పక్షుల ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రకృతి ఆనందాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సందర్బంగా ప్రకృతి ప్రేమికుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్‌​ కుమార్ స్వయంగా తన కెమెరాలో బంధించిన చిత్రాలతో ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ముద్రించిన క్యాలెండర్‌ను ప్రగతి భవన్‌లో ఎంపీ జోగినపల్లి సంతోష్‌​ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అనంతరం సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తాను తీసిన చిత్రాలతో క్యాలెండర్‌ను రూపొందించిన అనిల్ ను అభినందించారు. ఇది తనకో జ్ఞాపకంగా నిలుస్తుందని ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం మాట్లాడుతూ.. జోగినపల్లి సంతోష్‌​ కుమార్ చేస్తున్న కృషి అందరికి స్ఫూర్తివంతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Astrology: జనవరి 11, బుధవారం దినఫలాలు