NTV Telugu Site icon

MP Ranjith Reddy: కాంగ్రెస్‌పై ఎంపీ రంజిత్ ఫైర్.. ఎన్ని నిందలేసినా ప్రజలు నమ్మరు

Mp Ranjith Reddy

Mp Ranjith Reddy

MP Ranjith Reddy Fires On Congress Party Over Free Power: కాంగ్రెస్ పార్టీపై ఎంపీ రంజిత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వికారాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. అయితే.. వాళ్లు ఎన్ని నిందలు వేయాలని చూసినా, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తేల్చి చెప్పారు. మొదట్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు కేవలం మూడు గంటల ఉచిత విద్యుత్ చాలని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో అలా అనలేదంటూ సమర్థించుకోవడానికి ట్రై చేస్తున్నారని మండిపడ్డారు.

Pakistan: సీమాను తిరిగి పంపకపోతే 26/11 తరహా దాడి హెచ్చరికలు.. కొందరిపై కేసు నమోదు!

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ.. 24 గంటల్లో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి అని.. ఆయన ఆడమన్నట్లు రేవంత్ ఆడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014కి ముందు 60వేల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి ఉండేదని.. ఇప్పుడు రెండు కోట్ల 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండటం వల్ల.. రైతులు సంవత్సరానికి మూడు పంటలు పండిస్తున్నారని వెల్లడించారు. ఉచిత విద్యుత్ కోసం కేసీఆర్ ప్రభుత్వం కోట్లలో ఖర్చు పెడుతోందన్నారు.

Fake Diamonds: నకిలీ వజ్రాలతో ఘరానా మోసానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్

గతంలో కేవలం ఏడు గంటల కరెంట్ మాత్రమే ఉండేదని రంజిత్ రెడ్డి గుర్తు చేశారు. దాంతో సరిగ్గా వ్యవసాయం చేసుకోలేక రైతులు నానాతంటాలు పడేవారన్నారు. చివరికి మోటార్లు కూడా కాలిపోయేవని చెప్పారు. అయితే.. సీఎం కేసీఆర్ అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తున్నారన్నారు. కేసీఆర్ ఉంటేనే రైతు బందు, రైతు భీమా, ఉచిత కరెంట్ వస్తాయని పేర్కొన్నారు. రైతుల మేలు గురించి ఆలోచించే వ్యక్తి ఒక్క కేసీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.