Site icon NTV Telugu

Kotha Prabhakar Reddy: నేడు ఐటీ ముందు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

Mp Kotta Prabhakar

Mp Kotta Prabhakar

Kotha Prabhakar Reddy: తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రిజనార్దన్ రెడ్డి.. ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో.. సోదాల అనంతరం ఐటీ విచారణకు రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ నేతలకు నోటీసులు ఇచ్చారు. 84 గంటల పాటు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెంట్లు, ఆన్‌లైన్ లావాదేవీల ఆధారంగా పైళ్ల శేఖర్ రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు సంబంధిత వివరాలు, ఆధారాలతో హైదరాబాద్‌లోని ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఐటీ అధికారులు సూచించారు. శేఖర్ రెడ్డితో పాటు జానారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇవాళ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి ఐటీ ఎదుట హాజరుకానున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి సమయం కోరనున్నారు. గురువారం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి హాజరుకావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Read also: Sandeepa Dhar Pics: సందీప ధార్ హాట్ స్టిల్స్.. కుర్రాళ్ల కళ్లన్నీ బ్యూటీపైనే

అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 50 బృందాలుగా ఏర్పడిన అధికారులు బీఆర్‌ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నేత ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ నేత కొండపల్లి మాధవ్ ఇళ్లపై సోదాలు జరిగాయి. ఆదాయపు పన్ను లెక్కల్లో తేడాల కారణంగా ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. అయితే ఒకేసారి ముగ్గురు నేతల ఇళ్లలో ఐటీ దాడులు జరగడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల కిందటే బీఆర్‌ఎస్‌ నేతలకు ఐటీ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించనప్పటికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితం ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నేత ఇళ్లు, సంస్థల్లో ఏకకాలంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
Harsha Missing Case: మల్కాజ్గిరి హర్షవర్ధన్ కిడ్నాప్ కేసు.. కడప వాసి స్కెచ్

Exit mobile version