NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి తప్పు చేశాడు..? అతని ముఖం చూడను..!

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: చెరుకు సుధాకర్ ఇవాళ కాంగ్రెస్‌ కండువాకప్పుకున్నారు. రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఆయన హస్తంతో చేతులు కలిపారు. చెరుకు సుధాకర్‌ ఇంటి పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేసారు. అయితే దీనిపై కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందించారు. చెరుకు సుధాకర్‌ ను ఎలా పార్టీలోకి చేర్చుకుంటారని? మండి పడ్డారు. రేవంత్ రెడ్డి తప్పు చేశారని విమర్శించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనని ఓడించేందుకే చెరుకు సుధాకర్ ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాంటిది చెరుకు సుధాకర్‌ ను ఎలా కాంగ్రెసులో చేర్చుకుంటారని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల తర్వాతే మునుగోడు వెళ్తా అని కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి స్పష్టం చేసారు.

read also: AndhraPradesh-BalKrishna: విద్యుత్‌ వాహనాలపై ఆంధ్రప్రదేశ్‌ ఫోకస్‌. మెప్పించని ‘బాల్‌కృష్ణ’.

ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో షేక్‌ హ్యాండ్‌ తీసుకోవడమే కాకుండా.. తెలంగాణ ఇంటి పార్టీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేసారు. చెరుకు సుధాకర్ చేరిక తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తికి కారణమని రేవంత్‌ రెడ్డి ఆనందం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చెరుకు సుధాకర్‌ చేరికతో మరోసారి కాంగ్రెస్‌ లో విభేదాలు రాచుకున్నాయి. కోమటిరెడ్డిని ఓడిచేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తిని కాంగ్రెస్‌ ఎలా చేర్చుకుంటారు అనే ప్రశ్నలకు కాంగ్రెస్‌ టీపీసీసీ అద్యక్షుడు, అధిష్టానం ఎలా స్పందిస్తుంది. కోమటిరెడ్డిని బుజ్జగించేందు ప్రయత్నాలు చేస్తుందా వేచి చూడాలని. ఇప్పటికే రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలు, రాజీనామాతో కాంగ్రెస్ లో విభేధాలు భగ్గుమంటున్న వేళ ఇప్పుడు చెరుకు సుధాకర్‌ చేరికతో.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి తప్పు చేశాడు..? అతని ముఖం చూడను..!