Site icon NTV Telugu

MP K.Laxman : గౌడ కులస్తుల ఆరాధ్యదైవం సర్వాయి పాపన్న

K Laxman

K Laxman

MP K laxman Praised sarvai papanna goud

సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్. సర్దార్‌ సర్వాపాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ జాతి గౌరవపడే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వీరుడు సర్వాయి పాపన్న అని ఆయన కొనియాడారు. గౌడ కులస్తుల ఆరాధ్యదైవం సర్వాయి పాపన్న అని, మహ్మదీయులు తాటి చెట్టుపైన పన్ను విధించడంతో, వాళ్ళ ఆగడాలపై వీరోచితంగా పోరాటం చేశారన్నారు. సర్వాయి పాపన్న ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని తిరుగుబాటు చేశారని, నేటి యువతకు స్ఫూర్తి సర్వాయి పాపన్న అని ఆయన అన్నారు. గోల్కొండ కోటగా సామ్రాజ్యాన్ని స్థాపించి… బడుగుల రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయులు అని, తెలంగాణ గడ్డపై స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మహనీయుల త్యాగాల ఫలితమేనన్నారు. తెలంగాణ యువత తిరగబడాల్సిన అవసరం ఉందని, బీజేపీకి అండగా యువత పోరాటం చేసేందుకు ముందుకు రావాలన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు యువత చరమగీతం పాడాలని, నిజాం తరహా పాలనను కేసీఆర్ కొనసాగిస్తున్నారన్నారు.

కేసీఆర్ పాలనను భూస్థాపితం చేయడమే… సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళి అవుతుందన్నారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి… ట్యాంక్‌ బండ్ పై విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం.. సర్వాయి పాపన్న జీవిత చరిత్ర పుస్తకాన్ని బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతితో కలిసి ఆవిష్కరించారు లక్ష్మణ్‌. పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా లక్ష్మణ్ ను బీజేపీ శ్రేణులు సన్మానించారు.

 

Exit mobile version