NTV Telugu Site icon

Sad Incident: హైదరాబాద్‌లో మరో ఘోరం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి

Wife Susaid

Wife Susaid

Sad Incident: హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలను విషమిచ్చి, ఆపై ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈరోజు ఉదయం బోరబండ డివిజన్‌లోని మధురానగర్‌లో సంచలనంగా మారింది.

హైదరాబాద్ కు చెందిన జ్యోతి, విజయ్ భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు. జ్యోతి బంజారాహిల్స్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీజర్‌గా పనిచేస్తుంది. కొద్దిరోజులు వరకు అన్యోన్యంగా సాగిన వారి జీవితంలో కలహాలు మొదలయ్యాయి. రోజూ ఏదో ఒక గొడవతో భార్యభర్తలు తీవ్ర మనస్తాపానికి గురయ్యేవారు. ఇద్దరు భార్యభర్తలు అప్పటి వరకు బాగానే ఉన్నా.. ఏమైందో ఏమోకానీ.. భర్త బయటకు వెళ్లడం గమనించి తన ఇద్దరు పిల్లలు అర్జున్ (4), ఆదిత్య (2)లకు విషమిచ్చి చంపింది. ఆపై ఆమె కూడా ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన భర్త విజయ్ భార్య జ్యోతిని చూసి షాక్ తిన్నాడు. ఇద్దరు పిల్లకు కూడా విగతజీవిగా కనిపించడంతో భర్త విజయ్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అక్కడే వున్న స్థానికులు విజయ్ ను కాపాడారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న పిల్లలను కూడా జ్యోతి విషమిచ్చి చంపేంతగా వీరిద్దరి మధ్య గొడవ ఏం జరిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు, స్థానికులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు ఇవాళ హైదరాబాద్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు వేసి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఓల్డ్ బోయిన్ పల్లి భవానీనగర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీకాంతా చారి(42) వెండి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇద్దరు కుమార్తెలు స్రవతి (8), శ్రావ్య (7)లకు కూడా నిద్రమాత్రలు వేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో బోయినపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాల కారణంగానే శ్రీకాంతాచారి ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
Game Changer: దసరాకి ‘జాబిలమ్మ’ జాకెట్ వేసుకోని వస్తుందా? నమ్మకం లేదు శంకరా