ప్రేమ పేరుతో యువత వారి జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. కుటుంబం గురించి ఆలోచించకుండా వారి జీవితాన్ని వారే కడతేర్చకునే దుస్థితికి పాల్పడుతున్నారు. ప్రేమలో పడిన వారికి కుటుంబంతో పని లేకుండా పోతోంది. ప్రేమలో వున్న వారికి అంతా ప్రేమికులే జీవితంగా భావిస్తున్నారు. అదే ప్రేమ విఫలమైతే వారితో జీవించలేని బతుకు ఎందుకంటూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వారు మృతి చెందితే వారి ప్రేమించిన వ్యక్తి ఏమోగానీ.. మృతి చెందిన కుటుంబం ఏమవుతుందనే ఆలోచన కూడా లేకుండా పోతోంది ఈకాలం యువతకు. నవమాసాలు మోసీ పేగుతెంచుకుని కడుపులో పెట్టుకుని పుట్టిన కొడుకు ప్రేమ పేరుతో ప్రాణాలు కోల్పోతే ఆతల్లిదండ్రులు పడే ఆవేదన పగవాడికి కూడా రాకూడదు అంటుంటారు. ప్రేమ విఫలం కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకు ఆత్మహత్య చేసుకుని మృతి చెండంతో.. కొడుకు మరణం తట్టుకోలేని తల్లి బలావన్మరణానికి పాల్పడింది. ఈ విషాధ మైన ఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో చోటుచేసుకుంది.
read also: lions Rates: పాకిస్తాన్ లో గేదెల కన్నా చీప్ గా సింహాల ధరలు.. ఎందుకంటే..
వరలక్ష్మి, శివకుమార్ తల్లీ కొడుకులు రామాయంపేటలో నివాసం వుంటున్నారు. ఓ యువతిని ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించాడు శివకుమార్ కానీ.. ఏమైందో ఏమో కానీ.. వీరిద్దరి ప్రేమకు బ్రేక్ పడింది. దీంతో శివకుమార్ ప్రేమ విఫలమవడంతో శివకుమార్ మూడు రోజుల క్రితం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. కొడుకు మృతితో వరలక్ష్మి తీవ్రమనస్థాపానికి గురైంది.. శివకుమార్ మృతిని తట్టుకోలేక శుక్రవారం ఉదయం చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నది. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరలక్ష్మీ మృతదేహాన్ని చెరువులోనుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Jyotiraditya Scindia: నేడు, రేపు నియోజక వర్గ కార్యక్రమాల్లో సింథియా