NTV Telugu Site icon

Rapido Cab Services: ‘ఓకే చలో’ యాప్‌ సేవలు.. క్యాబ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం..!

Calo Aap

Calo Aap

Rapido Cab Services: హైదరాబాద్‌లో మరో కొత్త క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఊబర్, రాపిడో తరహాలోనే ‘ఓకే చలో’ పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ ‘ఓకే చలో’ క్యాబ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇతర అప్లికేషన్లతో పోలిస్తే ఈ సర్వీస్ ధరలు డ్రైవర్లు, ప్రయాణికులకు అనుకూలంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇతర సర్వీసుల్లో ఆటో, క్యాబ్ డ్రైవర్ల ద్వారా వచ్చే సొమ్ములో దాదాపు 30 శాతం నిర్వాహకులు తీసుకుంటున్నారు. ‘ఓకే చలో’ అప్లికేషన్ విషయంలో అలా జరగడం లేదని పోస్టిలియన్ మొబిలిటీ టెక్నాలజీస్ డైరెక్టర్ ఓరుగంటి ఉదయభాస్కర్ అన్నారు.

Read also: West Bengal: బెంగాల్లో తుఫాను విధ్వంసం.. నలుగురి మృతి, 100 మందికి గాయాలు

వినియోగదారుల భద్రతతో పాటు వారి ఫోన్ నంబర్‌ను తెలుసుకోకుండా ప్రైవసీని కాపాడుకుంటున్నట్లు పేర్కొంది. డ్రైవర్ల నుంచి భారీ కమీషన్లు కాకుండా నిర్వాహకులు మ్యాచ్ మేకింగ్ ఫీజుగా రూ.5 మాత్రమే వసూలు చేస్తున్నారు. దేశంలో ఇంత తక్కువ ధరకు సేవలు అందించే అప్లికేషన్ మరేదీ లేదని ఓకే చలో యాప్ యజమాని చెబుతున్నారు. అలాగే డ్రైవర్ సంక్షేమం కోసం 10 శాతం మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ యాప్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 3,500 మంది డ్రైవర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లు కాకుండా ఐఓఎస్ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించింది.
West Bengal: బెంగాల్లో తుఫాను విధ్వంసం.. నలుగురి మృతి, 100 మందికి గాయాలు