Moosarambagh: హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండిపోయాయి. అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ముసారాంబాగ్ వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. మూతపడిన వరద దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ వరద కాల్వలుగా మారాయి. పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతుకు వర్షపు నీరు చేరింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని నగరవాసులకు జీహెచ్‌ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రధాన రహదారులపైకి చేరిన వరద నీటిలో ద్విచక్రవాహనాలు, కార్లు ఇరుక్కుపోయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ముసాపేట మెట్రో స్టేషన్ కింద వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో కూకట్ పల్లి వైపు వెళ్లే వాహనాలు, అక్కడి నుంచి ఎర్రగడ్డ వైపు వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
Read also: Cab Drivers Protest: క్యాబ్ డ్రైవర్ల నిరసన.. ఆరూట్‌కు రాలేమంటూ రైడ్ క్యాన్సిల్..
దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆరంగర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకున్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్, ట్రాఫిక్ పోలీసులు అతికష్టమ్మీద వారిని బయటకు తీశారు. బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. ఏదైనా సహాయం కోసం GHMC హెల్ప్‌లైన్ నంబర్ 040-21111111, డయల్ 100, 9000113667కు కాల్ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. IMD ప్రకారం, దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి వాయువ్య మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. గంటకు 10-12 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నందున మంగళవారం నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
TS Liquor Sales: కోట్లు కురిపిస్తోన్న లిక్కర్ కిక్కు.. ఒక్క ఆగస్టులోనే 6 వేల కోట్ల ఇన్‌కం