Site icon NTV Telugu

HarishRao : ఒక పార్టీ ఓటుకు నోటు, మరొక పార్టీ సీటుకు నోటు -మంత్రి హరీశ్ రావు

Harishrao1

Harishrao1

ఒకపార్టీ నేత ఏమో ఓటుకు నోటు కేసు దొంగ ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ చీఫ్ అంటూ మంత్రి హ‌రీశ్‌ రావ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఇంకో పార్టీ నేతలేమో పదవుల కోసం కోట్లు డిమాండ్ చేసే పార్టీకి చెందినవారని ఎద్దేవా చేశారు.

కర్ణాటకలో బీజేపీ సీఎం సీటుకు రు. 2500 కోట్లు ఇవ్వాలట, ఆ పార్టీ ఎమ్మెల్యేనే మొన్న ఈ విషయం చెప్పారని మంత్రి హ‌రీశ్ రావ్ అన్నారు. అలాంటి పార్టీలు అవి అంటూ మండిపడ్డారు. ఒక పార్టీ ఓటుకు నోటు, మరొక పార్టీ సీటుకు నోటు చుర‌క‌లంటించారు. ఆయన జేపీ నడ్డా కాదు..అబద్ధాలకు అడ్డా అంటూ ఎద్దేవా చేశారు. ఒకరేమో మోకాళ్ల యాత్ర..ఇంకొకరేమో పాదయాత్ర , మరోకరేమో సైకిల్ యాత్ర అంటూ బయలు దేరారు అంటూ హ‌రీశ్ రావ్ తెలిపారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా మీ కేంద్రమంత్రే చెప్పారు. అది మ‌రిచిపోయారా అంటూ ప్ర‌శ్నించారు.

కేంద్ర మంత్రులేమో కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడిదంటే.. నడ్డా ఏమో అవినీతి జరిగింది అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేండ్ల కిందట పాలించింది కాంగ్రెస్ కాదా అంటూ ప్ర‌శ్నించారు హ‌రీశ్‌రావ్‌. కాంగ్రెస్ అంటేనే ఎరువుల కొరత. కాంగ్రెస్ అంటేనే పవర్ కట్లు అంటూ హ‌రీశ్ రావ్ చురుకలంటించారు. ఎరువుల కోసం..విత్తనాల కోసం కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడటం మరిచిపోయారా అంటూ హరీశ్ రావ్ గుర్తు చేశారు.

Warangal Crime : వరంగల్ లో కలకలం.. పత్లిమిల్లు యజమాని ఆత్యహత్యాయత్నం

Exit mobile version