Site icon NTV Telugu

Hyderabad: ఎంఎంటీఎస్‌కు తప్పిన పెను ప్రమాదం..

Mmts

Mmts

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌కు పెను ప్రమాదం తప్పింది… బేగంపేట నుంచి నాంపల్లి వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్‌కు నెక్లెస్‌ రోడ్‌ దగ్గర ప్రమాదం తప్పిపోయింది… సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా నెక్లెస్‌ రోడ్‌ దగ్గర ఆగిపోయింది ఎంఎంటీఎస్‌ లోకల్‌ ట్రైన్‌… రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ ఒక్కసారి పెద్ద శబ్దంతో ఆగిపోయింది… దీంతో, కంగారు పడిన ప్రయాణికులు.. భయాందోళనతో ట్రైన్‌ దిగి పరుగులు తీశారు.. ఉదయాన్నే ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో… ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వచ్చింది… ఇక, పోలీసుల సాయంతో ప్రయాణికులను దగ్గరలోని ఎంఎంటీఎస్ స్టేషన్ కి తరలించారు అధికారులు..

Read Also: T20 World Cup 2022: టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు.. వరల్డ్‌ కప్‌కు కీలక బౌలర్‌ దూరం

Exit mobile version