NTV Telugu Site icon

MLC Kavitha: సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వండి.. కవిత డిమాండ్

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: సమ్మక్క సారమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు వరంగల్ లోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగిందన్నారు. మూడు నెలలుగా పెన్షన్ ఇవ్వలేదు జనవరి ఒకటో తారీఖున అయిన పెన్షన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షల సంఖ్యలో జనం వెళతారు ..ఫ్రీ బస్సులు సంఖ్య పెంచాలన్నారు. 200 లోపు యూనిట్లు కరెంటును కాల్చే ప్రజలు జనవరి నుంచి కరెంటు బిల్లు కట్టకపోతే మంచిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తా అన్నారు.. కాబట్టి అది అమలు చేస్తారని అనుకుంటున్నా అన్నారు. కాలేశ్వరం పైన ఎంక్వయిరీ జరుగుతున్నది.. ఎంక్వయిరీ రిపోర్ట్ రాకుండానే మంత్రులు ఇది పాపాల పుట్ట అని కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడే సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయలేదు, పోటీలో లేకుండానే ఎలా ఓడిపోతావ్? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్మికుల వ్యతిరేక పార్టీ అని సింగరేణి ఎన్నికల్లో తేలిందన్నారు. ఇంటెలిజెంట్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని దాని పెద్ద ఇష్యూ చేశారు ముఖ్యమంత్రి అని ఆరోపించారు.

Read also: Viral Video: కూరగాయలు కొంటున్న శునకం.. ఎంత క్యూట్‌గా ఉందో..!

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తీ ఎలాంటి కామెంట్స్ చేయడం ఆయనకు తగదన్నారు. మా నాయకుడిచ్చిన సూచనతో వంద రోజులు సైలెంట్ గా ఉండమన్నారు. వందరోజులు సమయంలో సూచనలు మాత్రమే చేస్తున్నాం.. వంద రోజుల తర్వాత కచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు. ఎప్పుడు వరంగల్ కి వచ్చిన వినయ్ అన్న ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్తానని అన్నారు. మన జిల్లాలో ఇలాంటి జాతర ఉండటం మన అదృష్టం. ఇలాంటి జాతరకి నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వాలని, చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వంను కోరడం జరిగిందన్నారు. కానీ ఇంకా కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాలేదు, ప్రజలందరూ కలిసి సమ్మక సారలమ్మ జాతరకు నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇచ్చేదాకా పోరాటం చేయాలన్నారు. ఈరోజు వరంగల్ నుండి బీజేపీ పార్టీ నాయకులకి, నరేంద్ర మోడీకి తెలియజేయడం జజరుగుతుందన్నారు. సమ్మక్క సారాలమ్మా జాతరకి స్టేట్స్ ఇవ్వాలి అని తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ కావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 15 వేల కోట్లు మంజూరు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మేడారం జాతర కు 100 కోట్లు ఇచ్చామన్నారు. బస్ ఫ్రీ అనప్పటి నుండి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Read also: Ponnam Prabhakar: ఆర్టీసి సిబ్బందిపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదు

భారతదేశంలోని అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారక్క దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పురుషులకి ప్రత్యేక బస్సులు, స్త్రీలకు ఇబ్బంది కలగకుండా బస్సుల సంఖ్యను పెంచే ఆలోచన చేయాలన్నారు. ప్రజలు మీ మీద పెట్టిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి, ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండవు, రాజకీయంలో గెలుపు ఓట్లములు సహజం అన్నారు. ప్రజలకు ఆసౌకర్యo కలగాకుండా. 2000 లా పెన్షన్ వచ్చే వారికి 4000 లా పెన్షన్ పెంచి జనవరి ఒకటో తేదీ వరకు ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వమిచ్చిన ఈ పథకాలపై ప్రజలలో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. నిరుద్యోగ భృతి అనీది ఇస్తాం అన్నారు, కానీ వారు ఇచ్చిన ఆ గ్యారంటీ పధకాలలో ఎక్కడ ఆ కాలం కనిపించడం లేదు, యువకులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజలు కొన్ని విషయలలో అయోమయంలో ఉన్నారని తెలిపారు. ప్రజలను కష్ట పెట్టడం తప్ప.. ఈ పధకాలు అన్ని కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని మండిపడ్డారు. మీ సేవలో ఒక బటన్ ఒత్తుతే పూర్తి వివరాలు వస్తాయి కానీ ప్రభుత్వం ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుందో ప్రజల ఆలోచించాలన సూచించారు.
Hyderabad Gold ATM: అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో గోల్డ్ ATM.. ఎన్ని గ్రాములు కొనచ్చంటే?

Show comments